లండన్: బ్రిటీష్ చరిత్రలో అతిపెద్ద రాజకీయ కవాతుల్లో ఒకటి శనివారం లండన్‌లో జరిగిన మార్చ్. దీనిలో 800,000 మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు.లండన్ నగరం దాదాపు స్తంభించి పోయింది. గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న బాంబు దాడులకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనతెలిపేందుకు గత అయిదు వారాలుగా బ్రిటన్ ప్రజలు వారాంతపు ర్యాలీలు నిర్వహి స్తున్నారు. గాజాలోని అతిపెద్ద ఆసుపత్రిని ఇజ్రాయెల్ భూ బలగాలు మూసివేస్తున్నందున ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణకు పిలుపు నివ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.పౌరులు ప్రస్తుతం కాంప్లెక్స్‌లో ఆశ్రయం, చికిత్స పొందుతున్నారు, ''భూమిపై నరకం''గా గాజాను ఇజ్రాయిల్ మార్చింది. 'ఇజ్రాయెల్ యొక్క విచక్షణారహిత బాంబు దాడిలో ఇప్పటికే 11,000 మంది పాలస్తీనియన్లు మరణించారు, వీరిలో దాదాపు 5,000 మంది పిల్లలు తప్పిపోయారు, వారి స్వంత ఇళ్ల శిథిలాల కింద మరణించినట్లు భావించారు,'' అని నిరసనను నిర్వహించడానికి సహాయపడిన పాలస్తీనా సాలిడారిటీ క్యాంపెయిన్ డైరెక్టర్ బెన్ జమాల్ అన్నారు.