ప్రజాశక్తి-పాకాల(తిరుపతి) : పాఠశాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని స్కై లైన్ ఆక్స్ఫర్డ్ పాఠశాల కరస్పాండెంట్ పాలకూరి నాగేంద్ర అన్నారు. స్థానిక స్కై లైన్ ఆక్స్ఫర్డ్ పాఠశాల వారు ప్రపంచ స్థాయి వైద్యం అందించే విధంగా ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం అస్టర్ నారాయణాద్రి, వాసన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ప్రపంచ స్థాయి వైద్యం, అత్యుత్తమమైన వైద్య బృందం కలిగిన ఆస్టర్ నారాయణద్రి, వాసన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో పాఠశాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు.పాల్గొన్న వారికి కంటి పరీక్షలు,బ్లడ్ షుగర్,ఎత్తు బరువు,బీపీ,ఈసీజీ మొదలగు పరీక్షలు చేయడం జరిగిందని అన్నారు.పాఠశాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఇంకా మరెన్నో జరుపబోతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఉపాధ్యాయురాలు డాల్ఫిన్,యాస్మిన్,చెస్మీ, నారాయణాద్రి, వాసన్ కంటి ఆసుపత్రి వైద్యులు మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.










