Nov 14,2023 11:54

నిజాంపట్నం హార్బర్‌ (బాపట్ల) : బోటులో మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం ఉదయం బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో దండుప్రోలు చెన్నయ్య సన్‌ఆఫ్‌ / లక్ష్మయ్య బోటులో మంటలు చెలరేగి పడవ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో బి.వెంకటేశ్వర్లు (50), పి.కృష్ణ (50) లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.