
చిత్తూరు: ఏపీలో చిత్తూరు జిల్లాలో వాహనం డీ కొన్న ఘటనలో ఓ చిరుత రోడ్డు ప్రమాదంలో మఅతి చెందింది. జిల్లాలోని వి. కోట మండలం నాయకనేరి రహదారిపై రాత్రి రోడ్డును దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం డీ కొట్టింది. దీంతో ఆ చిరుత అక్కడికక్కడే మరణించింది. స్థానికులు గమనించి పోలీసు, అటవిశాఖ అధికారులకు సమాచారమివ్వగా సంఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు. చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. చిరుత మృతికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు అటవి శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తిరుమల దర్శనానికి కాలినడకన వెళ్లే యాత్రికుల భద్రతకు టీటీడీ పలు చర్యలు తీసుకుంటుంది.రెండు రోజుల క్రితం అలిపిరి వద్ద మరోసారి చిరుత కనిపించడంతో యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారాన్ని టీటీడీ అధికారులకు సమాచారమందించడంతో సంబంధిత అధికారులు భద్రత చర్యలు చేపట్టారు. యాత్రికులను గుంపులుగా వెళ్లాలని సూచించారు.