- బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కాలువ శ్రీనివాసులు
ప్రజాశక్తి - బి.కొత్తకోట(అన్నమయ్య) : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా అంగళ్లు చోటుచేసుకున్న అల్లర్లలో తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట, పిటియం, ములకల చెరువమండలాలకు చెందిన 8 మంది సభ్యులపై కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.ఎం.ఫర్వీన్ తాజ్ పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులు చేయడం వైసిపికి అలవాటేనన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, కార్యకర్తలకు టిడిపి అన్నివిధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అధికార పార్టీ అరాచకాలు ఎక్కువ రోజులు పనిచేయవని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.










