హైదరాబాద్ : నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ట్యాంక్‌బండ్‌పై కొత్త కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. హుస్సేన్‌సాగర్ గ్రిల్స్‌ను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరున్నారు. అయితే కారులోని ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం వారిద్దరూ కారు వదిలి పరారయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.










