Sep 16,2023 10:04

భీమడోలు (ఏలూరు) : బైక్‌ను కారు ఢీకొట్టడంతో మహిళకు తీవ్రగాయాలైన ఘటన శనివారం భీమడోలులో జరిగింది. జాతీయ రహదారి భీమడోలు మండలం కురెళ్లగుడెం వద్ద బైక్‌ను, కారు ఢీకొట్టడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. చేబ్రోలు నుంచి ఏలూరు వైపు బైక్‌ పై వెళుతున్నవారిని తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళుతున్న కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. గాయపడిన మహిళకు స్థానికులు సపర్యలు చేసి అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.