Nov 20,2023 08:04

నిజామాబాద్‌ : తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన యమగంటి కన్నయ్య గౌడ్‌ (36) అనే అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. నగరంలోని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ సంజీవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సాయినగర్‌లో నివాసముంటున్న కన్నయ్య ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.