రొంపిచర్ల (పల్నాడు) : బైక్ అదుపుతప్పి సిమెంటు దిమ్మను ఢీకొట్టడంతో యువతి మృతి చెందిన ఘటన మంగళవారం రొంపిచర్ల మండలం తుంగపాడు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతి చెందిన యువతి నరసరావుపేట సోనీ ఈవెంట్స్ కి చెందిన అశ్వినిగా గుర్తించారు. మున్నా అనే యువకుడికి తీవ్రగాయాలవ్వడంతో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










