సభ్యత్వ నమోదు కార్డును అందిస్తున్న వెలగపూడి
ప్రజాశక్తి - అరిలోవ : 9వ వార్డు పరిధి విశాలాక్షినగర్ పోలీస్ క్వార్టర్స్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ వెరిఫికేషన్, ఓటర్ నమోదు, ఓటర్ మార్పు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు, 9వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జి బుడిమూరి గోవింద్ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు హాజరై టిడిపి సానుభూతిపరులచే సభ్యత్వ నమోదు చేయించి సభ్యత్వ కార్డులను అందజేశారు. ఓటు హక్కు లేనివారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి వార్డు ప్రధాన కార్యదర్శి గెడ్డవలస వెంకటరావు, బాదరు బాలరాజు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.










