Sep 21,2023 20:59

ప్రజాశక్తి - ఆచంట
చంద్రబాబు అక్రమ అరెస్టు దారుణమని జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు అన్నారు. ఆచంటలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో పితాని వెంకట్‌, కేతా మీరయ్య, బీరా నరసింహమూర్తి, బోడపాటి దుర్గాప్రసాద్‌, కేతా మురళి పాల్గొన్నారు.
పాలకొల్లు : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో వద్ద టిడిపి శ్రేణులు చేస్తున్న దీక్షలు 9వ రోజుకు చేరాయి. టిడిపి బిసి నేతలు వర్షాన్ని సైతం లెక్కజేయకుండా దీక్షల్లో పాల్గొన్నారు. బిసి నేతలు కర్నేన గౌరు నాయుడు, కడలి గోపి, కర్నేన రోజారమణి, జివి, మామిడిశెట్టి పెద్దిరాజు, అంగర చిన్ని పాల్గొన్నారు.
మొగల్తూరు : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ముత్యాలపల్లిలో టిడిపి నేతలు పోస్టు కార్డులతో ప్రదర్శన చేశారు. అనంతరం సమీపంలోని తపాలా బాక్స్‌లో కార్డులు వేశారు. కార్యక్రమంలో నాయకులు కొల్లాటి బాలకృష్ణ, నాగిడి రాంబాబు, దొంగ స్వామి, కొల్లాటి మూలస్వామి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గొర్రెల సూరన్న కాంప్లెక్స్‌ వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. తాడేపల్లిగూడెం టౌన్‌, తాడేపల్లిగూడెం రూరల్‌, పెంటపాడు మండలాల మహిళా కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి మాట్లాడారు.
ఉండి : చంద్రబాబుకు అండగా మేము సైతం అంటూ నియోజకవర్గ తెలుగు మహిళలు తొమ్మిదో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కన్నెగంటి రూత్‌ కళ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు జిల్లా మహిళా అధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడారు. దీక్షలో కూర్చున్న మహిళలకు ఎంఎల్‌ఎ మంతెన రామరాజు సతీమణి సుష్మ రామరాజు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, గ్రామ అధ్యక్షులు కాగిత బుజ్జి, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, మండల మహిళ అధ్యక్షురాలు వత్సవాయి నాగ వెంకట సుజాత పాల్గొన్నారు.