Jul 17,2023 00:09

మాట్లాడుతున్న రమాదేవి

ప్రజాశక్తి-గుంటూరు : క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం విజయవాడలో ఆగస్టు 9న జరిగే మహాధర్నాను, ఈనెల 25న పాతగుంటూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆలిండియా ట్రేడ్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో జరిగే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ బిజెపి 9 ఏళ్ల పాలనాకాలంలో కార్మికవర్గంపై తీవ్రమైన దాడి చేస్తుందన్నారు. లేబర్‌ కోడ్‌ తీసుకురావటం ద్వారా కార్మికులు కనీసం యూనియన్‌ పెట్టుకునే హక్కును కోల్పాతారన్నారు. ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ, అదానీ సేవలో ఉంటూ కార్మిక హక్కులు కాలరాస్తూ తీవ్రదాడి చేస్తోందన్నారు. కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నారన్నారు. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కేంద్ర కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ విధానాలు విరమించుకోవాలని లేకపోతే జరుగు పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, నాయకులు ఎం.సాంబశివరావు, బి.ముత్యాలరావు, ఎన్‌.శివాజీ, వి.దుర్గారావు, షేక్‌.హుస్సేన్‌వలి, ఎన్‌.రమాసుష్మ, ఎం.భాగ్యరాజ్‌, ఎన్‌.రమేష్‌, టి.రాధ, వెంగమ్మ, బి.సత్యనారాయణ, ఎస్‌ఎం.వలి, బాషా, నాగరాజు, ఎం.రవి పాల్గొన్నారు.