Aug 04,2023 00:26

చిలకలూరిపేట: 'క్విట్‌ ఇండియా' స్పూర్తితో మోడీని గద్దె దింపి, దేశాన్ని కాపాడుకోవటానికి ఈ నెల 9న విజయవాడలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని వామపక్ష కార్మిక సం ఘాల నాయకులు పిలుపు నిచ్చారు. గురువారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఐటియుసి ఏరియా అధ్యక్షులు పెరురి రామారావు, సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు పేరు బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహించే నిమిత్తం శుక్ర వారం ఉదయం చిలకలూరిపేట నుంచి ప్రచార జీపు యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. మోడీ పాలనలో అవలంభిస్తున్న విధానాలు కార్మిక, ఉద్యోగ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ విధానాల వలన ధరలు ఆకాశానికి అంటి, వేతనాలు పాతాళానికి పోతున్నా యని, పేదరికం, ఆకలి,నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపద మొత్తం అదాని, అంబాని వంటి కొద్ది మంది చేతుల్లో పోగుపడిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే కార్మికులకే కాక రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు తదితర శ్రామి కులందరికీ తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించాలని, నాలుగు లేబరు కోడ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కార్మికవర్గం, రెతులో కలిసి మోడీ కార్పోరేట్‌ అనుకూల విధానాలపై దేశ వ్యాపిత ఉద్యమానికి పిలుపు నిచ్చిందని అన్నారు. రైతు, కార్మిక, ఉద్యోగ, సాధారణ ప్రజలకు వ్యతి రేకంగా ధనిక, కార్పోరేట్‌ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ ఆపాలని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 4 తేదీ నుంచి ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వై.రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు.ఆగస్టు 9 క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్‌ ఇండియా దినంగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎఐటియుసి గౌరవాధ్యక్షురాలు, ఏరియా కార్యదర్శి నా గబైరు రామ సుబ్బాయమ్మ, నాయకులు బొంతా భగత్‌ సింగ్‌, మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు పి.సురేష్‌, ఎ.వెంకట్రావు, ఎవి రమణ తదితరులు పాల్గొన్నారు.
మాచర్ల్ల: క్విట్‌ మోది-సేవ్‌ ఇండియా లక్ష్యంగా ఈ నెల 9వ తేదిన విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేసేందుకు కార్మికలోకం కదలి రావాలని సిపిఐ ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి కోరారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎఐటియుసి అనుబంధ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గోన్న మేకపోతుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మోది ప్రభుత్వం కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పోరేట్‌ రంగ సంక్షేమానికి పని చేస్తున్నట్లు వివరించారు. మోది పాలనలో ఇప్పటికే అనేక వ్యవస్థలు చిన్నాభిన్నంగా మారినట్లు వివరించారు. దేశ వ్యాప్తంగా మోది నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు కార్మిక లోకం ఐక్యంగా కదలాలని కోరారు. కారంపూడి, దుర్గి, మాచర్లలో కార్మి కులను చైతన్య పర్చిందుకు శుక్రవారం ప్రచార జాత వస్తోందని, ప్రచార జాతలో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొ నాలని అన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి మిద్దెపోగు బాబురావు, సిహెచ్‌ లింగారెడ్డి, రామయోగి, కిరణ్‌, సీతయ్య, లక్ష్మయ్య, బ్రహ్మచారి, మంగయ్య పాల్గొన్నారు.