Jan 07,2023 22:58

 వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి కోట కళ్యాణ్‌
ప్రజాశక్తి-మైలవరం

 ప్రజా వ్యతిరేక మతోన్మాద బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షకుల రాష్ట్ర హక్కుల సాధన కోసం ఈనెల 9వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. మైలవరంలోని రైతు సంఘం కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంపదంతా పెట్టుబడిదారులు, కార్పొరేటర్లకు దోచిపెడుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర, గ్యారెంటీ చట్టం అమలు చేయాలని, పేద మధ్యతరగతి కౌలు రైతులకు వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏకకాల రుణమాఫీ చేయాలని,60ఏళ్ల నిండిన వారందరికీ పెన్షన్‌ ఇవ్వాలని,నాలుగు లేబర్‌ కోడ్లు విద్యుత్‌ సవరణ చట్టం 2022 రద్దు చేయాలని, ఏపీలో స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లను ఉపసంహరించుకోవాలని, డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి చాట్ల.సుధాకర్‌,రైతు సంఘం మండల కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి, జి కొండూరు సిఐటియు మండల కార్యదర్శి బాలకష్ణ, తదితరులు పాల్గొన్నారు.