Aug 06,2023 00:20

పిడుగురాళ్ల: 'మోడీని గద్దించండి.. దేశాన్ని కాపాడండి' అనే నినాదంతో ఈ నెల 9వ తేదీన క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో విజయవాడలో జరిగే మహాధర్నాలో కార్మికు లు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పిలుపు నిచ్చారు. సిఐటియు, ఎఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో ప్రచారజాత పల్నాడు జిల్లాలో పర్యటిస్తూ శని వారం పిడుగురాళ్లకు చేరిన సందర్భంగా స్థానిక మార్కెట్‌ యార్డులో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26,000, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పోరాడుతుంటే, మోడీ ప్రభుత్వం మాత్రం ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని విమ ర్శించారు. ప్రభుత్వ సంస్థలను అప్పనంగా అమ్మకానికి పెడుతున్నారని మండిపడ్డారు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్‌రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాల రాస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే కార్మి కులకు, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెస్తోందని విమర్శించారు. నిత్యావసరాల ధరలు,పెట్రోల్‌, డీజిల్‌ , గ్యాస్‌, విద్యుత్‌ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై మరింత భారం వేస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఓట్ల కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, ఇందులో భాగంగానే ఎన్‌ఆర్సి, సిఏఏ చట్టాలను తీసుకువచ్చి ముస్లింలు, క్రైస్తవులను ఈ దేశ పౌరులుగా నిరూపించు కోవాలని నిబంధన పెడునతోందంటూ మోదీ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. మహిళా సాధికారిత గురించి గొప్పగా చెప్పే మోదీ ప్రభుత్వం, మణిపూర్‌ లో ముగ్గురు మహిళలను నగంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడమేనా మహిళా సాధికారత అంటే అని ఎద్దేవా చేశారు. కార్మిక హక్కులను కాపాడు కోవాలంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, దీనికోసం మరో క్విట్‌ ఇం డియా ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని కార్మికులకు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి టి. శ్రీనివాసరావు, యార్డు ముఠా వర్కర్స్‌ సంపత్‌ వెంకటకృష్ణ, టి.వెంకయ్య, నాగేశ్వరరావు, మోహన్‌రావు, కరిముల్లా,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బెల్లంకొండ: మండల కేంద్రంలో సిఐటియు, ఎఐటియుసి ఆధ్వ ర్యంలో ప్రచార జాత నిర్వహించారు. సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షుడు కె. హనుమంతరెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో కార్మికులకు సమ్మె చేసే హక్కు, ధర్నా చేసే హక్కు కనీస వేతనం పొందే హక్కు వంటివన్నీ రద్దయిపోతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా నాయకులు సైదా, బెల్లంకొండ సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌ పుల్లారావు, మండల అధ్యక్షుడు టి. సైదయ్య ,మేరీ తదితరులు పాల్గొన్నారు. పెదకూరపాడు: కార్మిక సంఘాల ప్రచార జీపు జాత పెదకూరపాడు మండలానికి చేరింది. కార్యక్రమంలో హనుమంత్‌ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.