Nov 18,2023 21:55

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు జిల్లా జడ్జి దామోదరరావు

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  డిసెంబర్‌ 9న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్టు రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్‌.దామోదరరావు తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహణపై సంబంధిత శాఖలతో స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులు జాతీయ లోక్‌అదాలత్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. జాతీయ లోక్‌అదాలత్‌లో వెలువరించి తీర్పులకు పరిపూర్ణత ఉందన్నారు. రాజీ మార్గంలో పరిష్కారం జరుగుతుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులంతా ఉపయోగించుకొని సాధ్యమైనంత వరకు కేసులు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.రమేష్‌, అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ డి.సౌజన్య, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వి.నాగేశ్వరరావు, పార్వతీపురం బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు, రూరల్‌ సిఐ బిసిచ్‌ స్వామినాయుడు, ఎన్ఫోర్స్మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.ఉపేంద్ర, న్యాయవాదులు, పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.