
మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి - జగ్గయ్యపేట: మండలంలోని షేర్ మహమ్మద్ పేట, రామచంద్రుని పేట, అనుమంచిపల్లి గ్రామ ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్న గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ తీసివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ జరగబోయే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఎం జగ్గయ్యపేట మండల,పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి కోరారు. మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా షేర్ మహమ్మద్ పేటలోని గ్రీన్ టెక్ ఫ్యాక్టరీని తీసివేయాలని పోరాటాలు చేస్తున్నా స్పందించకపోవడంతో ఈ బైక్‌యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకనబోయిన లింహరావు, తదితరులు పాల్గొన్నారు.