ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 99వ వర్ధంతిని పురస్కరించుకొని. ఆదివారం స్థానిక తిరుపతి రోడ్డు గల విగ్రహానికి రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా చేతులు మీదుగా పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రిటిష్ వారిని ఎదిరించి మన ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి అన్న రాంప్రసాద్ రెడ్డి, పుత్తూరు మునిసిపల్ చైర్మన్, ఏ హరి. వైస్ చైర్మన్లు, డీ జయ ప్రకాష్. డి శంకర్ కౌన్సిల్లర్లు, పుత్తూరు రూరల్ మండలం ఎంపీపీ మునివేలమ్మ. వైస్ ఎంపీపీలు, ముసామిరెడ్డి. ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










