Oct 19,2023 20:57

లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న జెసి గోవిందరావు, టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్‌

పార్వతీపురంటౌన్‌: జిల్లాలో 9522 మంది లబ్దిదారులకు జగనన్న చేదోడు నాలుగో విడత నిధులు రూ.9.522 కోట్లు పంపిణీ చేసినట్లు జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు. గురువారం కలెక్టరు కార్యాలయంలో జరిగిన జగనన్న చోదోడు జిల్లా స్థాయి నిధులు పంపిణీ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు పాల్గొని లబ్దిదారులకు చెక్కును అందజేసి నిధులు విడుదల చేశారు. అనంతరం జెసి మాట్లాడుతూ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి, షాపులున్న రజకులు, షాపులున్న నాయీబ్రాహ్మణులు, టైలరింగ్‌ చేస్తూ షాపులున్న అన్ని కులాల వారికి ఏడాది రూ.10వేలు చొప్పున అందజేశామన్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో నాలుగో విడత 2969 రజకులకు రూ.2.969కోట్లు, 1090 నాయీ బ్రాహ్మణులకు రూ.1.090 కోట్లు, 5463 టైలరింగు వృత్తిదారులకు రూ.5.463 కోట్లు చొప్పున 9522 మంది లబ్దిదారులకు 9.522 కోట్ల రూపాయలు నిధులు పంపిణీ చేశామని తెలిపారు. టిడ్కో చైర్మన్‌ జె.ప్రసన్నకుమార్‌ మాట్లాడూతూ ప్రభుత్వం పేదలను ఆదుకొనేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, అందులో వెనుకబడిన కులాల అభివృద్దికి, వారికి ఆర్థిక ఉన్నతికి అధికప్రాధాన్యమిస్తూ చేదోడుగా నిధులు పంపిణీ చేసిందని తెలిపారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషను చైర్మన్‌ ఆర్‌.రమాదేవి, పలు సామాజికవర్గాల డైరెక్టర్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎస్‌.కృష్ణ, లబ్దిదారులు పాల్గొన్నారు.