అమరావతి: మండల పరిధిలోని వైకుంఠపురంలో పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేపట్టి గూడు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చింది ముఖ్యమంత్రి జగనేనని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. అమరావతి మండలం వైకుంఠపురంలో పేదలకు జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం ఎస్సీ కాలనీకి చెందిన 91 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. కేవలం ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లుకట్టించి ఇవ్వడం జగనన్న పాలనలోనే సాధ్యమైం దన్నారు. ఇళ్లస్థలాలు అందుకున్న వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు.










