ప్రజాశక్తి - రేపల్లె
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో టిడిపి చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్ల రిబ్బన్లు కట్టుకుని నినాదాలు చేశారు. చంద్రబాబుకు మద్దత్తుగా సంతకాల సేకరణ చేశారు. అనగాని శివప్రసాద్, జీవి నాగేశ్వరరావు మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని అన్నారు. జగన్ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాల్లో చైతన్యం కలిగించాలని అన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి మేకా శివరామకృష్ణ, పంతాన్ని సాయికుమార్, కుదరవల్లి వెంకటేశ్వరరావు, నల్లూరి అజయ్, తాడిపత్రి మల్లికార్జునరావు, పివి చింతారావు, నేత్ర నాగేంద్రబాబు, డొక్కు వెంకటేశ్వరరావు, కామరాజు గడ్డ నాగశ్రీ, దేవగిరి రవికుమార్, రేపల్లె రామాంజనేయులు, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










