క్వార్టర్ ఫైనల్స్ కి చేరిన 8 జట్లు
ప్రజాశక్తి - పిఠాపురం
8వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళ పురుషుల రగ్బీ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోషియేషన్ వారి ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న పోటీలను స్థానిక మినీ స్టేడియంలో ఎంఎల్‌ఎ పెండం దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తమ మీద ఉందని తమ నియోజకవర్గ కి వచ్చినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను పట్టణంలో ఏర్పాటుచేసిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం క్రీడాకారులతో కరచాలనం చేసి అభినందించారు. అనంతరం శనివారం 11 జిల్లాల ప్రతినిధులు పోటీల్లో పాల్గొనగా పురుషుల విభాగం నుంచి నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. మహిళా విభాగ పోటీలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్, తూర్పు గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మనాభం, ఎపి రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, తూర్పుగోదావరి జిల్లా రగ్బీ రగ్బీ సంఘం జిల్లా అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ , కోచ్ పి లక్ష్మణ్ రావు, ఉపాధ్యక్షులు కేతవరపు కృష్ణా, సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్‌మోజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొ న్నారు. సాయంత్రం క్యాంప్‌ఫైర్‌కి పిఠాపురం మాజీ ఎంఎల్‌ఎ టిడిపి అధికార ప్రతినిధి ఎస్‌విఎస్‌ఎన్ వర్మ పాల్గొన్నారు. పిల్లా సత్యనారాయణ శిష్య బృందం సాంస్కతిక కార్యక్రమాలు పలువురు ఆకట్టుకున్నాయి.
పోటీలను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ దొరబాబు










