వెల్లింగ్టన్ : ఇప్పటివరకు ఏడు ఖండాల గురించే విన్నాం. ఇప్పుడు జీలాండియా అనే ఎనిమిదవ ఖండాన్ని కనుగొన్నామని న్యూజిలాండ్ శాస్త్రీయ బందం ప్రకటించింది. దీనికి సంబంధించి సవరించిన మ్యాప్‌ను సిద్ధం చేశారు. పశ్చిమ అంటార్కిటికా భౌగోళిక నిర్మాణాన్ని పోలిన ప్రాంతం సముద్రపు అడుగుభాగంలో 3500 అడుగుల లోతులో ఉందని, ప్రధాన భూభాగంలో 94 శాతం నీటిలో ఉందని ఆ బృందం తెలిపింది. న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ జరిపిన అధ్యయనం తాలూకు ఫలితాలు టెక్టోనిక్స్‌తో సహా ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఇది అతి పిన్న వయసు కలిగిన అతి చిన్న, అత్యంత సున్నితమైన ఖండమని పరిశోధనా బందం చెబుతోంది. పసిఫిక్ మహాసముద్రం దిగువ నుండి సేకరించిన రాళ్ళు,మట్టిని అధ్యయనం చేయడం ద్వారా జిలాండియా స్థలాకతి నిర్ణయించబడింది. డచ్ నావిగేటర్ అయిన అబెల్ టాస్మాన్ 1672లో ఎనిమిదవ ఖండం గురించి ప్రకటించాడు. 1895లో స్కాటిష్ ప్రకతి శాస్త్రవేత్త జేమ్స్ హెక్టర్, టాస్మాన్ కనుగొన్న న్యూజిలాండ్ సముద్రగర్భంలోని జీలాండియా ఉందని ఊహించాడు. 1995లో, అమెరికన్ జియోఫిజిసిస్ట్ బ్రూస్ లుయెండి జీలాండియాను ఒక ఖండంగా పరిగణించవచ్చని సూచించారు. దీనికి ఆ పేరు పెట్టింది ఆయనే. ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి దీనిని భూభాగంగా పరిగణించవచ్చా అన్న మీమాంస తలెత్తింది.