ప్రజాశక్తి - తాళ్లరేవు: ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ , ఆటల పోటీల సంబరం తాళ్లరేవులో నేడు మొదలుకానుంది. మండల స్థాయి స్కూల్ గేమ్స్ 8, 11, 12 తేదీల్లో తాళ్లరేవు, చొల్లంగి హైస్కూల్స్‌లో జరగనున్నాయని ఎం.ఈ.ఓ. ఏ. మంగాయమ్మ తెలిపారు. పోటీల్లో భాగంగా కబడ్డీ ,బ్యాడ్మింటన్ ,త్రోబాల్ , బాల్ బ్యాడ్మింటన్, యోగా , అథ్లెటిక్స్ లోను పోటీలు నిర్వహిస్తారు. మూడు రోజులపాటు రెండు పాఠశాలలో నిర్వహించనున్న ఈ ఆటలలో 8వ తేదీన తాళ్లరేవు జడ్పీ హైస్కూల్లో అండర్ 14 అండర్ 17 బాలురు, బాలికలకు అథ్లెటిక్స్, 11 వ తేదీన 8 ఆటలలో పోటీలు , 12వ తేదీన చొల్లంగి జడ్పీ హైస్కూల్లో అండర్ 14 అండర్ 17 బాలురు బాలికలకు 8 ఆటలలో పోటీలు నిర్వహించనున్నట్లు మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ వి. కే. ఆర్. తంబి తెలిపారు










