Nov 06,2023 00:14

చిలకలూరిపేట : కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ,విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 8 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ జయప్రదం చేయాలని విద్యార్థి, యువజన నాయకులు ఆదివారం పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పండరీ పురంలోని ఏలూరి సిద్దయ్య విజ్ఞాన భవన్‌లో వాల్‌పోస్టర్లను ఆవిష్కరిం చారు. ఈ సందర్బంగా ఎఐవైఫ్‌ జిల్లా కన్వీనర్‌ షేక్‌ సుభా నీ,ఎస్‌.ఎఫ్‌.ఐ డివిజన్‌ కార్య దర్శి సిద్దు, గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్య క్షులు శ్రీను నాయక్‌, ఎన్‌ఎస ్‌యుఐ పట్టణ అధ్యక్షులు బాషా, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కారు స్వప్న కుమార్‌, మాట్లాడుతూ అనేక త్యాగాలతో, విద్యార్థి యువజన నాయకులు 32 మంది ప్రాణ త్యాగాలతో, వామపక్ష ఎమ్మెల్యేల, ఎంపిల పదవి త్యాగంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూను కోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం నవంబర్‌ 8 నాటికి వెయ్యి రోజులు పూర్తి అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అన్ని విద్యార్థి యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు నవం బర్‌ 8వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపు నిచ్చారు. లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను విర మించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా ఇనుము, గనులు కేటాయించక పోవడం సిగ్గు చేటన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ల క్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేస్తామని చెప్పారు. రాయల సీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న హామీ ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే లక్షలాది మంది నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తా యని చెప్పారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా, వెనుకబడిన ప్రాం తాల అభివృద్ధికి నిధులు ఇవ్వక కపోవ డంతో పాటు నూతన పరిశ్రమలు ఏర్పాటు వంటి విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తున్న మోడీని రాష్ట్రంలోని బిజెపి నేతలు ఎందుకు అడగడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతికి ఉపాధి కల్పిం చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్య మాలు నిర్వహిస్తామని తెలిపారు. నవం బర్‌ 8న రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ వరకు జరిగే విద్యా సంస్థల బంద్‌ కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి సహ కరించాలని పిలుపు నిచ్చారు. కార్య క్రమం లో సిఐటియు మండల కన్వీనర్‌ పేరుబోయిన వెంకటేశ్వర్లు, రైతు సంఘం కార్యదర్శి బొల్లు శంకరరావు, సిఐటియు నాయకులు పి.శ్రీనివాసరావు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రత్తిపాటి శశికుమార్‌, ఈశ్వర్‌, కుమ్మరి చంద్ర పాల్గొన్నారు.