Nov 04,2023 00:59

ప్రజాశక్తి - భట్టిప్రోలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కడప ఉక్కు పరిశ్రమను స్థాపించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8న విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి మనోజ్ కోరారు. స్థానిక గాయత్రి అకాడమీలో బందు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రభుత్వమే  నష్టాల్లోకి నెట్టి నష్టాల పేరుతో ప్రవేశికరణ చేస్తామని కేంద్రంలోని బిజెపి ప్రకటించడం దుర్మార్గమైన చర్యని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వ్యతిరేక ఉధ్యమం నవంబర్ 8నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుందని అన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్ధి, యువజన సంఘాల బందుకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్నివర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మొహిద్దిన్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.