Nov 07,2023 01:07

దాచేపల్లిలో.. బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విడుదల ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

పిడుగురాళ్ల: నవంబర్‌ 8 న జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థలు బంద్‌ పోస్టర్‌ను సోమ వారం యువజన విద్యార్థి సంఘాల నాయ కులు దాచేపల్లిలోని యూనియన్‌ బ్యాంక్‌ వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోట సాయి కుమార్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు చూస్తూ కూర్చోవటం బాధాకరమన్నారు. కేంద్రం చర్యలను ఆయా పార్టీలు అడ్డుకోక పోగా అధికార బిజెపికి వంత పాడుతున్నా యని విమర్శించారు. విభజన హామీల ప్రకారం ప్రభుత్వ రంగంలో నిర్మించాల్సిన కడప ఉక్కు పరిశ్రమను ప్రైవేటు రంగంలో నిర్మించటం రాష్టానికి పాలకులు చేస్తున్న ద్రోహం అన్నారు. నవంబర్‌ 8 న జరుగు రాష్ట్ర వ్యాప్త బంద్‌ లో విద్యా సంస్థలు ,ప్రజలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంద్‌ అనం తరం కూడా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తమ తీరు మార్చుకోని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందో ళనలు ఉదతం చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు నరేంద్ర దాచేపల్లి పట్టణ అధ్య క్షుడు విక్రమ్‌ పాల్గొ న్నారు. బంద్‌ పోస్టర్లను పిడుగురాళ్ల లోని కేఎన్‌ఆర్‌ విద్యా సంస్థల ముందు ఎస్‌ఎ ఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోట సాయి కుమార్‌ ఆవిష్కరించారు. మండల నాయకులు హేమంత్‌, బెనర్జీ పాల్గొన్నారు.సత్తెనపల్లి: నవంబర్‌ 8న రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బందులో పాల్గొని జయప్రదం చేయాలని, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ మానుకోవాలని, కడప ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగం లో నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోటా సాయికుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పుతుంబాక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వ హించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోటా సాయి కుమార్‌ పాల్గొని మాట్లాడారు. సమా వేశంలో డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు రాజ్‌ కమార్‌, సిపిఎం సత్తెనపల్లి మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ పాల్గొన్నారు.
 మాచర్ల : స్థానిక సిఐటియు కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల శాఖ సమావేశం మం డల కార్యదర్శి రాఘవ అధ్యక్షతన జరి గింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజ రైన పల్నాడు జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కును నేడు కార్పో రేట్‌ వ్యక్తులకు అప్పనంగా అప్ప జెప్పేం దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. సమా వేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కె.జ్యోతిష్‌ కుమార్‌, వినుకొండ పట్టణ కార్యదర్శి చైతన్యకుమార్‌, నరేష్‌, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.