Nov 03,2023 19:34

పోస్టర్లను ఆవిష్కరించిన విద్యార్థి, యువజన సంఘాలు

8న విద్యా సంస్థల బంద్‌

ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్‌

కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేట్‌ పరం చేయొద్దని నవంబర్‌ 8న జరిగే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కోరారు. శుక్రవారం నాడు బంద్‌కు సంబందించిన పోస్టర్లను నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఎం.శ్రీనివాసులు, పిడిఎస్‌యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ నంద్యాల జిల్లా అధ్యక్షుడు డక్క కుమార్‌, ఐసా జిల్లా నాయకుడు రంగస్వామి, పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు మర్రిస్వామి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మహానంది ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని గత దశబ్దం కు పైగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న, ప్రభుత్వాలు మాత్రం శిలాఫలకాలకే పరిమితం అయ్యయన్నారు. బ్రాహ్మణీ ఉక్కు పరిశ్రమ పేరుతో భారీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం, తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శంకుస్థానలు, నిర్మాణం పూర్తి చేస్తామని హామీలు మాత్రం ఇస్తూ, చేస్తూ వస్తున్నాయని, చివరికి, తక్కువ సామర్థ్యంతో పరిశ్రమను పూర్తి చేసేందుకు ఇప్పటి ప్రభుత్వం శంకస్తాపన చేసిందన్నారు. చదువుకున్న యువత వలస వెళుతున్నారని, ఇక్కడ నిర్మాణ దశలో ఆగిపోయిన గతంలోని భారీ పరిశ్రమనే పరిశ్రమ పూర్తయితే ఇక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. అందుకోసం విద్యార్థులు, యువకులు కలిసి ఈనెల 8న జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో, జిల్లా నాయకులు నవీన్‌ , ఎస్‌ ఎఫ్‌. ఐ నాయకులు హరివర్ధన్‌, జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.