Apr 06,2023 22:30

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 8వ తేదీన సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తుందని గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ రామకృష్ణ గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంమవుతుందని, 3.35కు గుంటూరు స్టేషన్‌కు వస్తుందని అన్నారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తుందని చెప్పారు. గుంటూరులో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రైలులో మంచి సదుపాయాలు ఉంటాయని, రైలఅంతా సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్లలో హాల్ట్‌ ఇచ్చారు. పిడుగురాళ్లలో మధ్యాహ్నం 2.30 గంటలకు, గుంటూరులో 3.35 గంటలకు, తెనాలిలో సాయంత్రం 4.15 గంటలకు, బాపట్లలో 4.50 గంటలకు రైలు ఆగనుంది.