Nov 05,2023 00:14

పల్నాడు జిల్లా: ఈ నెల 8 న జరుగనున్న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థలు బంద్‌ వాల్‌పోస్టర్‌ను యువజన విద్యార్థి సంఘాల నాయకులు నరస రావుపేట కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయ రాజు మాట్లాడుతూ 32 మంది యువకుల ప్రాణ త్యాగం , అనేక మంది రైతులు తక్కువ ధర కి భూమి త్యాగం చేసిన ఫలితంగా నిర్మించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు చూస్తూ కూర్చోవటం బాధాకరమన్నారు. కేంద్రం చర్యలను ఈ పార్టీలు అడ్డుకొక పోగా కేంద్ర బిజెపికి వంతపాడుతూ ఉన్నాయని విమర్శించారు. విభజన హామీల ప్రకారం ప్రభుత్వ రంగంలో నిర్మించాల్సిన కడప ఉక్కు పరిశ్రమను ప్రైవేటు రంగంలో నిర్మించడం రాష్టానికి పాలకులు చేస్తున్న ద్రోహం అన్నారు. ఈ నెల 8 న జరుగనున్న రాష్ట్ర వ్యాప్త బంద్‌ లో విద్యాసంస్థలు స్వచ్ఛం దంగా పాల్గొనాలని ప్రజలు, విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. బంద్‌ అనం తరం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరు మార్చుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.