Jun 02,2023 23:40

సమావేశంలో మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-గుంటూరు : ఉద్యోగుల ఐక్యత ద్వారానే ప్రతి సమస్యకూ పరిష్కారం సాధ్యమవుతుందని, దీనికి గుంటూరులో నిర్వహించే ప్రాంతీయ సదస్సు వేదిక కావాలని ఎపి జెఎసి అమరావతి నాయకులు పిలుపునిచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో ఈనెల 8వ తేదీన నిర్వహించే ప్రాంతీయ సదస్సు సన్నాహక సమావేశాన్ని స్థానిక రెవెన్యూ భవన్‌లో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో జెఎసి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో చట్టపరమైన హక్కులను కూడా పోరాటం ద్వారానే సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనికి ప్రతి ఉద్యోగి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమానికి ఎపి జెఎసి అమరావతి జిల్లా చైర్మన్‌ కనపర్తి సంగీతరావు, ప్రధాన కార్యదర్శి పిఎ కిరణ్‌కుమార్‌, కో-చైర్మన్‌ బి.విజరుకుమార్‌, క్లాస్‌ ఫోర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కృష్ణారావు, పిఆర్‌ ఇంజినీరింగ్‌ అధ్యక్షులు అసోసియేషన్‌ శ్రీధర్‌, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.