పల్నాడు జిల్లా: అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ 8న నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ లోని భువన చంద్ర టౌన్ హాల్ లో 'పల్నాడు కవితోత్సవం కార్యక్రమం జరనుంది. ఈ విషయాన్ని శ్రీశ్రీ కళా వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి గుండాల రాకేష్ ఆదివారం తెలిపారు. పల్నాడు కవితోత్సవానికి సంబంధించి న వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భగా కళా వేదిక నిర్వాహకులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అభినందించారు. రాకేష్ మాట్లా డుతూ ఈ కవితోత్సవంలో భాగంగా జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పల్నాడు కళాక్షేత్రం నిర్వాహకులు పొన్నపాటి ఈశ్వరరెడ్డి, అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ అధ్యక్షులు కాల్వ రవి, శ్రీ శ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షురాలు ఎస్ శాంతి బాయి, ఉపాధ్యక్షు రాలు షేక్ సఫ్రున్నిస, అమర్, వైసిపి నాయకులు ఖాదర్ బాషా, రాజా, వంశీ పాల్గొన్నారు.










