ప్రచార జాత కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు
మంగళగిరి: మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రచార జాత ఈ నెల 8వ తేదీన మంగళగిరి రానుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్ చెంగయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మం గళగిరి సిఐటియు కార్యాలయంలో మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమా వేశంలో రాష్ట్ర ప్రచార జాతకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్క రించారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం రవి, యూనియన్ నాయకులు ఆర్.వేణు, టి.బాబు, మంగయ్య, కె.అంజనేయులు, ఎస్.శాంతి తదితరులు పాల్గొన్నారు.










