Jun 28,2023 23:53

యడ్లపాడు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె. ఎస్‌ .జవహర్‌ రెడ్డి వచ్చే నెల 8వ తేదీన కొండ వీడు కోటను సందర్శించ నున్నారు. ఈ విషయాన్ని కొండ వీడు కోట అభివద్ధి కమిటీ కన్వీనర్‌ కల్లి శివారెడ్డి తెలిపారు. వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో జవహర్‌రెడ్డిని కలిసి ఆహ్వానిం చామని, కొండవీడు కోటను, కొండవీడు నగరవనంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయనకు వివరించినట్లు తెలిపారు. ఈ సందర్శనలో భాగంగా కొండ వీటి రెడ్డి రాజు పెద్ద కోమటి వేమారెడ్డి రాసిన 'సప్తతీసారము' వ్యాఖ్య, 'అమరు కావ్యం' గ్రంథా లను చీఫ్‌ సెక్రటరీ,రాష్ట్ర అటవీ దళాధిపతి వై.మధుసూదన్‌ రెడ్డి లు ఆవిష్కరించనున్నారని, ఈ రెండు గ్రంథాలను కొండ వీడు హెరిటేజ్‌ సొసైటీ ముద్రిస్తుందని తెలిపారు.