
8న జిల్లా స్థాయి జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక
ప్రజాశక్తి - పగిడ్యాల
ఈ నెల 8వ తేదీ నా ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం సమావేశంలో మాట్లాడుతున్న పుల్యాల నాగిరెడ్డి. పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్ ఖోఖో జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనవచ్చునారు. 1 జనవరి 2006 సంవత్సరములు జన్మించినవారు 18 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలు పాల్గొన వచ్చున్నారు. వయస్సు ఎత్తు బరువు కలిపి 250 పాయింట్లు కలిగి ఉండాలన్నారు. ఇక్కడ ఎంపికైన జిల్లా స్థాయి జూనియర్ ఖోఖో జట్ల ఈనెల 20 నుంచి 22 వరకు చిత్తూరు జిల్లా యాద మర్రి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఖోఖో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు టి శంకర్, పి ప్రభాకర్, ఫిజికల్ డైరెక్టర్ కృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు కుమార్, క్రీడా శ్రీ తోకల పీతాంబ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.