Nov 05,2023 00:11

గణపవరంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు

చిలకలూరిపేట : నిత్యావసర సరుకుల ధరలు ఎందుకు పెరుగు తున్నాయో ప్రజలకు అర్థం కావడం లేదని, ఉలి ్లపాయలు కొనలేని పరిస్థితి నెల కొందని సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 15 న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ మండలం లోని వేలూరు, మాను కొందువరి పాలెం, గొట్టిపాడు, మిట్టపాలెం, దండ మూడి, నాగబైరువారి పాలెం, ఈవూరువారు పాలెం పసుమర్రు, గణపవరం, పలు గ్రామాల్లో శనివారం ప్రచా రం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లా డుతూ పెట్రోల్‌, డీజిల్‌,గ్యాస్‌ ధరల పెరుగుదల,విద్యుత్తు ఛార్జీలు, ఆస్తి పన్ను వంటి భారాలను ప్రజలపై మోపుతోందని, కార్మిక చట్టాల రద్దు, ప్రజలపై భారాలు వేసి కార్పొ రట్‌ సంస్థలకు లాభాలను కట్టబెడుతోందంటూ ప్రభు త్వం తీరుపై విమర్శలు చేశారు. సిపిఎం ప్రజారక్షణ భేరి యాత్ర ఈ నెల 8వ తేదీన చిలకలూరిపేట రానుందని, ఆరోజు ఉదయం 9 గం చిలకలూరి పేటలోని కళా మందిర్‌ సెంటర్‌ వద్ద బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు.రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని, కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచే రాష్ట్రం లోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీ లను ఓడించాలని పిలుపు నిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజారక్షణ భేరీ బస్సు యాత్రను జయ ప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య పల్నాడు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి జి. విజయ కుమార్‌, పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. కార్య క్రమంలో కాకాని రోశయ్య, పి. శ్రీనివాసరావు, వై.కృష్ణ, పి.గణేష్‌ పాల్గొన్నారు.