దీక్షలో కూర్చున్న స్టీల్‌ప్లాంట్ కార్మికులు
ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 882వ రోజుకు చేరుకుంది. దీక్ష శిబిరంలో ఆర్‌ఎస్ అండ్ ఆర్‌ఎస్, ప్లాంట్ డిజైన్, ఎఫ్‌ఎండి, సిఎంఇ, విఎస్‌జిహెచ్ విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తిని తగ్గించి నిర్వీర్యం చేయాలని చూస్తున్న యాజమాన్యం కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. దీనికోసం ఐక్య పోరాటాలు నిర్మించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని స్పష్టంచేశారు.










