Mar 04,2023 00:01
చందలూరులో కంటి పరీక్షలు చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-పంగులూరు: శంకర్‌ నేత్రాలయం, అంధత్వ నివారణ సంస్థ సహకారంతో, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ పంగులూరు ఆధ్వర్యంలో, శుక్రవారం చందలూరు గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్‌ ఎల్లారెడ్డి వైద్య బృందం ఈ శిబిరాన్ని నిర్వహించింది. 85 మందికి కంటి పరీక్షలు చేయగా, అందులో 30 మందికి కంటి శుక్లాల ఆపరేషన్‌ చేయాలని నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ పంగులూరు అధ్యక్షులు పెండ్యాల జగదీశ్వరరావు, రోటరీ బాధ్యులు చిలుకూరు వీరరాఘవయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.