
మాట్లాడుతున్న ఎఒ
ప్రజాశక్తి-ఎస్.రాయవరం: మండలంలో రైతుల సమస్యలపై మండల స్థాయి అధికారులతో బుధవారం తహసిల్దార్ కార్యాలయంలో మండల వ్యవసాయాధికారి సౌజన్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.వర్షా భావ పరిస్థితుల నేపథ్యంలో నారు మడులు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ప్రత్యామ్నయంగా 80 శాతం రాయితీ పై విత్తనాలు అందజేయడం జరుగుతుందని ఎఒ తెలిపారు. రైతులు తమ దగ్గర లోని ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. ప్రత్యామ్న యంగా చిరు ధాన్యాలు, అపరాలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ విజయకుమార్, డిప్యూటీ తహసిల్దార్ శ్యాం కుమార్, మండల నీటిపారుదల శాఖ అధికారి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.