మాజీ ఎంపీ మాగంటి బాబు
ప్రజాశక్తి - చింతలపూడి
వైసిపి ప్రభుత్వంపై 80 శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని మాజీ ఎంపీ, టిడిపి అధినేత మాగంటి బాబు అన్నారు. పట్టణంలో ఈ నెల 30న చంద్రబాబు పర్యటన సందర్భంగా రోడ్‌షో సాగే ప్రాంతాలను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజా సమస్యలపై టిడిపి నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
టి.నరసాపురం: చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని కృష్ణాపురం శివార్లలో టిడిపి మండల నాయకులు అచంట అనిల్ కుమార్ తోటలో సోమవారం కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. వైసిపి నాయకులు పోలవరం నిర్వాసితుల సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం టిడిపి ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో కొనకళ్ల రామారావు, మాజీ ఎంఎల్‌ఎ ఘంటా మురళీ రామకృష్ణ, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు శీలం వెంకటేశ్వరరావు, జయ్యవరపు శ్రీరామమూర్తి, మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణారావు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆచంట అనిల్‌కుమార్ పాల్గొన్నారు.










