పట్టుబడిన నిందితులతో పోలీసులు
ప్రజాశక్తి -జి.మాడుగుల: మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. గంజాయి కారులో నలుగురు ఉండగా, ఇద్దరు పరారయ్యారని పేర్కొన్నారు. మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గంజాయితో పాటు కారు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కి తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.










