ప్రజాశక్తి-డుంబ్రిగూడ: డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అరమ సబ్ సెంటర్ పరిధి నడిమివలస గ్రామంలో కలుషిత ఆహారం తినడంతో సుమారు 9 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని అరకులోయ ఏరియా హాస్పిటల్‌కు రాత్రి తరలించగా అక్కడ వైద్య సేవలు పొందుతూ పాంగి గున్నమ్మ (70 )అనే వృద్ధురాలు మృతి చెందింది. గిరిజనుడు వంతల జయరాం (50 ), వంతల సూచన( 9 ), వంతల కేవిల్ (4), వంతల శామ్యూల్ (6), వంతల ఇస్మాయిల్( 2), వి.ఎలిసా(4),వి.ఎలిసా ( 9 ) యాకోబు (5 ) హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. గ్రామంలో ఓ కార్యం నేపథ్యంలో మధ్యాహ్నం గ్రామస్తులు భోజనం చేశారు. కొద్ది గంటల తర్వాత సాయంత్రం వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు భయాందోళనకు గురై హుటాహుటిన అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అస్వస్థతకు గురైన బాధితులను అరకులోయ ఏరియా హాస్పిటల్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తుండగా పరిస్థితి విషమించి గున్నమ్మ అనే వృద్ధురాలు మృతి చెందినట్లు గ్రామస్తులు. తెలిపారు. వైద్యం పొందుతున్న వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫుడ్ పాయిజనా లేక కలుషితమైన తాగునీటి తాగడంతో జరిగిందా అని అనేది తెలియాల్సి ఉంది. తక్షణమే ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు, చుట్టుపక్కల గిరిజనులు కోరుతున్నారు.
బాధితులకు గిరిజన సంఘం పరామర్శ
అరకులోయ రూరల్:అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందతున్న బాధితులను గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, మండల కార్యదర్శి పి.రామన్న, సీపీఎం మండల కార్యదర్శి కె.రామారావులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతి చెందిన పాంగి గునమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నడిమివలస గ్రామంలో మెడికల్ క్యాంపు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.










