Jul 17,2023 00:00

సమావేశంలో మాట్లాడుతున్న గద్దె ఉమాశ్రీ

సత్తెనపల్లి: ఐద్వా ఆధ్వర్యంలో ఆగష్టు 7న హింసపై మహిళల పోరు యాత్ర రాష్ట్ర జాత సత్తెనపల్లి పట్టణానికి వస్తున్న సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయా లని ఐద్వా పట్టణ కార్యదర్శి గద్దె ఉమాశ్రీ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానికంగా జరిగిన ఐద్వా పట్టణ కమిటీ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి మునగా జ్యోతి అధ్యక్షత వహించారు. ఉమాశ్రీ మాట్లాడుతూ 7న సభను జయప్రదం చేసేం దుకు వార్డుల్లో కరపత్రాలు పంపిణీ చేసి,సమావేశాలు నిర్వ హించాలని, కమిటీలు వేయాలని కార్యకర్తలకు సూచిం చారు. మహిళలపై జరుగుతున్న హింసను అధ్యయనం చేయాలని, కమిటీ నిపుణులతో కమిటీ వేయాలని, మహి ళలకు,చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని, నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠిన శిక్షలు విధిం చాలని, ప్రభుత్వం మీడియా మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.హింస, అశ్లీలత, అసమానతలను ప్రేరేపించే చలనచిత్రాలను, టివి సీరియల్స్‌, ఇంటర్నెట్‌ కార్యక్రమాలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. మద్యం,మత్తు పదార్థాలను నియం త్రణకు చర్యలు చేపట్టాలని, మండలానికి ఒక్క మద్యం షాపును మాత్రమే అనుమతించాలని కోరారు. ఆయా డిమాండ్ల సాధనకు అన్ని పక్షాలను కూడగట్టి ఐద్వా ఆందోళన సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ డిమాండ్లను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఐద్వా జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని మాట్లాడుతూ హింస లేని సమాజం కోసం చేయి చేయి కలుపుదామని, మద్యం,మత్తు పదా ర్థాలను నియంత్రించాలని అన్నారు. సమావేశంలో ఐద్వా నాయకులు ధరణికోట విమల, కట్టా రమాదేవి, గింజుపల్లి నాగలక్ష్మి, మొగిలిపాలెపు రమాకుమారి పాల్గొన్నారు.