
ప్రజాశక్తి - భీమవరం రూరల్
ప్రముఖ గాంధేయ వాది, విద్యాదాత చింతలపాటి సీతారామ చంద్ర వరప్రసాద మూర్తిరాజు భీమవరంలో ఆర్‌ఆర్ డిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సెప్టెంబర్ 7న కళాశాల ప్రాంగణంలో స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వికెజె.ప్రసూన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత మూర్తి రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ఉత్సవాలకు సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి ముఖ్య సలహాదారుగా, కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులతో నిర్వహణా కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ ఎస్.లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలోనే ప్రతిభ సాధనలో కళాశాల ముందుందని చెప్పారు.