ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అకారణంగా తొలగింపబడ్డ ఆప్కోస్ ఉద్యోగుల నిరవధిక నిరసనలు శుక్రవారం 788వ రోజు కొనసాగాయి. విధుల నుంచి తొలగించి రెండేళ్లకు పైగా కావస్తున్న స్పందించని ప్రభుత్వ తీరుపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నా, ఉద్యోగాలు చేసుకోవాలనుకున్న తమను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు కారణాలు చూపకుండా పని చేస్తున్న 65 మంది ఆప్కాస్ ఉద్యోగులను తొలగించిన తీరు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుందని ధనుంజయ రావు, దయానంద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిహెచ్.ఏడుకొండలు, రమణ, శివ, రాంబాబు సభ్యులు పాల్గొన్నారు.