Jul 31,2023 23:58

మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి-పాడేరు:వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయాలని, అర్హులైన వారందరికీ వీఆర్వో ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 7,8 తేదీల్లో అల్లూరి జిల్లా కలెక్టరేట్‌ ముందు నిరసన దీక్ష చేస్తున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం వీఆర్‌ఏల జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న ఉద్యమానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాల పెరగ లేదని, దీంతో, వీఆర్‌ఏలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైసిపి అధికార రాకముందు వీఆర్‌ఏలకు అనేక హామీలు ఇచ్చిందని నేటికీ అమలు చేయలేదని అందుకే ఉద్యమానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు కొండబాబు, కార్యదర్శి శేఖర్‌ పాల్గొన్నారు.