కంటి పరీక్షలు చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలంలోని నూతల పాడులోని ఆశ్రయ వృద్ధాశ్రమం లో గురు వారం నేత్రవైద్య శిబిరం జరిగింది. కారం చేడుకు చెందిన ఎల్.వి ప్రసాద్ కంటి వైద్యశాల వైద్యులు వచ్చి నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 78 మందికి కంటి పరీక్షలు చేసి 23 మందికి శుక్లాల ఆపరేషన్లు చేయాలని నిర్ధారించారు. ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో కంటి ఆసుపత్రి సిబ్బంది నాగ రాజు, రెటీనా స్పెషలిస్ట్ శ్రీనివాసరావు, ఆశ్రమ నిర్వాహకులు భవనం శ్రీనివాసరెడ్డి, జయలక్ష్మిలు పాల్గొన్నారు.










