Oct 25,2022 23:32

పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు

నలుగురు నిందితుల అరెస్టు
ప్రజాశక్తి-మారేడుమిల్లి :
అక్రమంగా తరలిస్తున్న 72 కిలోల గంజాయిని మారేడుమిల్లి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నలుగురు నిందితులను ఆరెస్ట్‌ చేశారు. ఎస్సై రాము కథనం ప్రకారం... చింతూరు మండలం తులసీపాకల గ్రామంలో గంజాయిని ఇనోవా కారులో లోడు చేసుకొని, మారేడుమిల్లి మీదగా ముంబైకి తరలిస్తుండగా స్థానిక గుజ్జుమామిడి వలస జంక్షన్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కారులోని మూడు బస్తాలలోని 72 కిలోల గంజాయిని స్వాధీన చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్ర, ముంబైకి చెందిన రెహన్‌ రెయిన్‌ ఖాన్‌, చింతూరు మండలం పొల్లూరుకు చెందిన పుట్టపల్లి రవి, తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా లక్ష్మిపూర్‌కు చెందిన మహ్మామద్‌ అబ్ధుల్‌, ఖమ్మం జిల్లా మునుగూరుకు చెందిన కొనేటి సత్యనారాయణ అనే నాలుగురు నిందితులను ఆరెస్ట్‌ చేశారు. గంజాయిని రవాణకు వినియోగించిన కారు, పల్సర్‌ బైకును సీజ్‌ చేశారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.2,16,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.