Aug 23,2023 22:11

ముంపునకు గురైన వరినాట్లు

ప్రజాశక్తి - వీరఘట్టం :  మండలంలోని ఇటీవల కురుస్తున్న వర్షాలకు సుమారు 70 ఎకరాలు వరి పంట నీటి మునిగి పోయింది. నడుకూరు సమీపంలోనే సీతమ్మధార చెరువు గర్భం లో నీరు కాలువలో ప్రవ హించి ఒట్టిగెడ్డకు వరద పోటెత్తడంతో 70 ఎకరాల వరి పంట నీట మునిగింది. ప్రతిసారి వర్షం కురిస్తే ఇదే పరిస్థితి తలెత్తుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్టిన పెట్టుబడులు రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.