Sep 18,2023 14:38

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసస్తూ పాలకొల్లులో 6 వ రోజైన సోమవారం నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 6 వ రోజు దీక్షల్లో కూర్చున్నారు. ఈరోజు వినాయక చతుర్థి అయిన రాష్ట్రంలో పండుగ వాతావరణం లేదని చంద్రబాబును విడిచిపెట్టాక రాష్ట్రంలో పండుగ చేసుకుంటామని మహిళలు చెబుతున్నారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష లో నిమ్మల కుటుంబం సభ్యులు పాల్గొని చంద్రబాబుకు సంఘీ భావం తెలిపారు. ఇంకా దీక్షల్లో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ పాల్గొన్నారు.